Mahaboobnagar
గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హండె కేలూర్ గ్రామస్తుల వినతి
మద్నూర్, ఆగస్టు 3: E6 tv NEWS (M. మస్నాజీ) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండె కేలూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామానికి కొత్త కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)కు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో గ్రామస్తులు పేర్కొన్న వివరాల ప్రకారం, బీసీ కాలనీలో గడ్డివార్ వీరేశంకు అక్రమ నిర్మాణం పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారని తెలిపారు. అయితే అదే ప్రాంతంలో తాము గత 20 ఏళ్లుగా…
నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు…
హాస్టల్ భద్రతపై ప్రశ్నల వర్షం: మహబూబాబాద్, వరంగల్ ఘటనలతో ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు!
వరంగల్ / మహబూబాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత, పర్యవేక్షణ తీరుపై తీవ్ర అనుమానాలను, కలకలాన్ని రేకెత్తిస్తున్నాయి. వరుసగా హాస్టళ్ల నుంచి విద్యార్థినులు బయటకు వెళ్ళిపోతుండటం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మహబూబాబాద్‌లో ఇద్దరు డిగ్రీ విద్యార్థినుల గల్లంతు: మహబూబాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు సడన్‌గా కనిపించకుండా పోయారు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో మహబూబాబాద్ టౌన్…
భీంగల్‌లో ఘనంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు
భీంగల్, ఆగస్టు 2: E6 tv NEWS (తాటికొండ గంగాధర్). రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం భీంగల్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్…
ఇల్లు కూల్చివేస్తామని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళ ధర్నా
సర్పంచ్‌పై కక్ష సాధింపు ఆరోపణలు ఎంపీడీవో హామీతో విరమించిన ఆందోళన మద్నూర్ ఆగస్టు 1: (E6 tv NEWS, M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కెల్లూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇంటిని కూల్చివేస్తామని బెదిరిస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగింది. సర్పంచ్‌కు ఓటు వేయలేదనే కక్షతో తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది.బాధిత మహిళ మాట్లాడుతూ, తన ఇంటిని కూల్చివేయాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయ…
సీఎం సహాయనిధితో నిరుపేదకు అండగా
రూ.5 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందజేసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయిక మహేష్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని…
మహబూబాబాద్‌లో విషాదం: చేనులో పత్తి ఏరేందుకు వెళ్లిన 22 ఏళ్ల యువతి బావిలో శవమై లభ్యం!
మహబూబాబాద్ / కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యువతి బాణోత్ వెన్నెల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏం జరిగింది? స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం వెన్నెల పత్తి చేనులో పని చేయడానికి పొలానికి వెళ్లింది. అనంతరం ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆరా తీయగా, గాంధీనగర్ సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం తేలియాడుతూ…
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బోల్తా పడిన ఆపిల్ లోడ్ డిసిఎమ్.. పండ్ల కోసం ఎగబడ్డ జనం!
మహబూబాబాద్ / తొర్రూర్: వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మటేడు విలేజ్ స్టేజ్ సమీపంలో ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డిసిఎమ్ (DCM) వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆపిల్ పండ్ల బాక్సులు పగిలిపోయి, పెద్ద ఎత్తున ఆపిల్ పండ్లు జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆపిల్ పండ్ల కోసం జనం…
నాగర్‌కర్నూల్ పాలనలో సరికొత్త మార్క్.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాపాలన విజయం!
నాగర్‌కర్నూల్ / హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాకేంద్రక పాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం 90 రోజుల్లోనే (మూడు నెలలు) 2019 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి నిరంతర ఫీల్డ్ పర్యటనలు, పారదర్శకత మరియు కఠినమైన జవాబుదారీతనంతో జిల్లా పాలనా యంత్రంగం రూపురేఖలను మార్చివేశారు. అధికారాన్ని కేవలం సమీక్షా సమావేశాలు, ఏసీ గదుల సమీక్షలకే పరిమితం చేయకుండా…

