Breaking News

ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మైనార్టీ మోర్చా నిరసన

రైతుబంధు, వరి ధాన్యానికి బోనస్ హామీలను అమలు చేయాలి: మల్లెపల్లి రాజేందర్ రెడ్డి పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్). ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ వైఖరిని…

Read Full News

మల్కాపూర్‌లో కలకలం.. తల్లి, ఇద్దరు చిన్నారులు అదృశ్యం!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ముగ్గురూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగొల్ల భూమవ్వ తన కుమార్తె సరిత (30), మనవరాళ్లు…

Read Full News

స్థల వివాదంలో పత్రికా విలేకరి దౌర్జన్యమంటూ ఆరోపణలు..!

న్యాయం చేయాల్సిన చోట వార్తలతో వేధిస్తున్నారంటూ బాధితుడి ఆవేదన..! 12 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన స్థలంపై వివాదం ప్రహరీ గోడ కూల్చివేతతో రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని ఆరోపణ విలేకరి, కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉందంటున్న పిప్పరి గోపాల్ తన వాదన వినకుండా వరుస కథనాలు ప్రచురిస్తున్నారని ఆవేదన స్థల పత్రాలు పరిశీలించి న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి జగిత్యాల, అక్టోబర్ 27 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి పట్టణంలో ఓ…

Read Full News

ఓల్డ్ ఎంఐజీలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోదీపై వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తల నిరసన పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ బిచ్చారెడ్డి చౌరస్తాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా…

Read Full News

వెంకట ఖాజా ఆలయ నిర్మాణానికి రూ.20 వేల విరాళం

ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో నిర్మిస్తున్న వెంకట ఖాజా ఆలయ నిర్మాణానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.20 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్…

Read Full News

కేటీఆర్, హరీశ్‌లు భ్రమల్లో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను వారు గుర్తించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉద్యోగాల భర్తీ వల్ల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం…

Read Full News

తుమ్మిడిహట్టి చర్చలు డ్రామా: కాంగ్రెస్‌పై బాల్క సుమన్ ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే సాగునీరు, విద్యుత్ లేక రైతుల పంటలు ఎండిపోయి కరవు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల నిజమైన సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలను ఓ పెద్ద డ్రామాగా…

Read Full News

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం

త్వరలో మండల స్థాయి కమిటీ ఏర్పాటు 14 రంగాలకు చెందిన కార్మికులకు కమిటీలో ప్రాతినిధ్యం కార్మికులకు లేబర్ కార్డులు, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్). ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమల ఐలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా త్వరలో ఎల్లారెడ్డిలో పూర్తి స్థాయి…

Read Full News

బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ROBపై నిర్లక్ష్యమా..?

అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా.. – ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల జాప్యంపై మహా ధర్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి భిక్షాటన చేసిన ఎమ్మెల్యే ఇందూరు, అక్టోబర్ 27 (E6TV న్యూస్: శివ ఠాకూర్). నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై అర్బన్ ఎమ్మెల్యే…

Read Full News

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ జయేశ్‌ రంజన్ కీలక నిర్ణయం

తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) కోసం దరఖాస్తు చేసుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆయన పదవీ విరమణ కాలం 2027 సెప్టెంబర్‌ 30 వరకు ఉన్నప్పటికీ, ఏడాది ముందే నిష్క్రమించేందుకు వీఆర్‌ఎస్‌ కోరారు. 1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్‌ రంజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప, గుంటూరు, మెదక్ జిల్లాల కలెక్టర్‌గా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖల్లో…

Read Full News