Breaking News

ఓల్డ్ ఎంఐజీలో ఖర్గే దిష్టిబొమ్మ దహనం

ప్రధాని మోదీపై వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తల నిరసన

పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్). పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ బిచ్చారెడ్డి చౌరస్తాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడటం అప్రజాస్వామికమని, ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ కంజర్ల కృష్ణమూర్తితో పాటు గుండాల ముకేశ్ రెడ్డి, జగన్మోహన్, శ్రీశైలం యాదవ్, సత్యం గౌడ్, 111వ డివిజన్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *