Breaking News

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం

త్వరలో మండల స్థాయి కమిటీ ఏర్పాటు

14 రంగాలకు చెందిన కార్మికులకు కమిటీలో ప్రాతినిధ్యం

కార్మికులకు లేబర్ కార్డులు, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్).

ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమల ఐలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా త్వరలో ఎల్లారెడ్డిలో పూర్తి స్థాయి మండల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. నిర్మాణ రంగానికి సంబంధించిన 14 విభాగాల నుంచి ఇద్దరు చొప్పున కార్మికులను ఎంపిక చేసి కమిటీలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం

తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు, వెల్డర్లు, సెంట్రింగ్ మేస్త్రీలు, టైల్స్ మేస్త్రీలు, లేబర్లు తదితర విభాగాలకు చెందిన కార్మికులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.ఎల్లారెడ్డి ప్రాంతంలోని ప్రతి భవన నిర్మాణ కార్మికుడిని గుర్తించి, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి సభ్యత్వ కార్డులు (లేబర్ కార్డులు) ఇప్పించడంలో కమిటీ సభ్యులు సహకరిస్తారని వివరించారు.కార్మికుల సమస్యలను గుర్తించి, వారి హక్కులు, సంక్షేమం కోసం సంఘం తరఫున కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

పలువురు నాయకుల హాజరు

ఈ సమావేశంలో జిల్లా నాయకులు తన్నీరు చిరంజీవి, ఎం. నారాయణ, ఎర్ల సంగమేశ్వర్, అబ్దుల్ రజాక్, తిరుపతయ్య, మహమ్మద్ ఖమ్రుద్దీన్, మహమ్మద్ అమీరుద్దీన్, మహమ్మద్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *