Breaking News

మల్కాపూర్‌లో కలకలం.. తల్లి, ఇద్దరు చిన్నారులు అదృశ్యం!

ఎల్లారెడ్డి, అక్టోబర్ 27 (E6tv న్యూస్).

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ముగ్గురూ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగొల్ల భూమవ్వ తన కుమార్తె సరిత (30), మనవరాళ్లు వైష్ణవి (8), సంగిక (6) కనిపించడం లేదని అక్టోబర్ 27న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 26న ఉదయం సుమారు 11 గంటల సమయంలో సరిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటి నుంచి వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఆ రోజు నుంచి ముగ్గురూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం వెతికినట్లు తెలిపారు. అయినప్పటికీ వారి జాడ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదును స్వీకరించిన ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి తల్లి, ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. వారు ఇంటి నుంచి వెళ్లడానికి గల కారణాలు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *