Breaking News

ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మైనార్టీ మోర్చా నిరసన

రైతుబంధు, వరి ధాన్యానికి బోనస్ హామీలను అమలు చేయాలి: మల్లెపల్లి రాజేందర్ రెడ్డి

పటాన్‌చెరు, అక్టోబర్ 27 (E6 TV న్యూస్).

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లెపల్లి రాజేందర్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ వైఖరిని ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు విధానాలు, ప్రజా సమస్యలకే పరిమితం కావాలని, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ప్రధానమంత్రి కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం, వరి ధాన్యానికి బోనస్ వంటి హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

గత కాంగ్రెస్ పాలనకు సంబంధించి వచ్చిన కుంభకోణాల ఆరోపణలపైనా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు.రైతుల హక్కులు, ప్రజల ఆత్మగౌరవం, దేశ గౌరవం కోసం బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మల్లెపల్లి రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *