Breaking News

కేటీఆర్, హరీశ్‌లు భ్రమల్లో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఇంకా భ్రమల్లోనే జీవిస్తున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను వారు గుర్తించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, ఉద్యోగాల భర్తీ వల్ల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఆ పార్టీకి చెందిన ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేల్లో చాలామంది మళ్లీ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు. నవంబర్ నాటికి అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రత్యక్ష లక్ష్యం ఎన్నికలేనని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *