తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆయన పదవీ విరమణ కాలం 2027 సెప్టెంబర్ 30 వరకు ఉన్నప్పటికీ, ఏడాది ముందే నిష్క్రమించేందుకు వీఆర్‌ఎస్ కోరారు. 1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్ రంజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కడప, గుంటూరు, మెదక్ జిల్లాల కలెక్టర్‌గా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐటీ, పరిశ్రమల శాఖల్లో సుదీర్ఘకాలం కీలకంగా వ్యవహరించి T-Hub ఏర్పాటుతో పాటు అనేక పెట్టుబడుల సమీకరణలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌ఎస్ దరఖాస్తుపై కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ కీలక నిర్ణయం

