ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి
డీఈవో అశోక్‌కు ప్రెస్ క్లబ్ వినతి – సానుకూల స్పందన ఒకటి, రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, జూలై 14: E6 న్యూస్ శివ ఠాకూర్అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి…
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!
జీడిపప్పు కుంభకోణం కేసు: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. పరిశ్రమల శాఖ కార్యదర్శికి షాక్!కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన జీడిపప్పు అభివృద్ధి సంస్థ (KSCDC) అవినీతి కేసులో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు విచారణలో భాగంగా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహమ్మద్ హనీష్ స్వయంగా కోర్టుకు హాజరుకావాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఈ మేరకు హనీష్ దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు…
అమెరికా రక్షణ బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానం!
హైదరాబాద్: డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఒక కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో అమెరికాకు చెందిన ‘యూఎస్ నేషనల్ వార్ కాలేజీ’ (US National War College) ఉన్నత స్థాయి బృందం ప్రత్యేకంగా భేటీ అయ్యింది.ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు:పెట్టుబడి అవకాశాలు: తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ (రక్షణ), మరియు స్పేస్ (అంతరిక్ష) రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అనుకూలతలను…
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సంచలన నిజాలు!
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు జైలులో అందుతున్న వైద్య చికిత్సపై ఆయన కుమారులు సులైమాన్ ఖాన్, ఖాసిమ్ ఖాన్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడియాలా జైలులో ఉన్న తన తండ్రికి కంటి సంబంధిత సమస్యకు సరైన వైద్యం అందడం లేదని, ఇది కేవలం “కనీస స్థాయి” చికిత్స మాత్రమేనని వారు ఆరోపించారు. ముఖ్యాంశాలు:కంటి చూపుపై ఆందోళన: ఇమ్రాన్ ఖాన్‌కు కుడి కంటిలో సెంట్రల్ రెటినల్ వెయిన్ అక్లూజన్ (CRVO)…
పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి
పిల్లల మధ్య సరైన అంతరం ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ, సదస్సుకుటుంబ నియంత్రణలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మాలపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అవగాహన ర్యాలీ, అనంతరం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్…
కొత్త హెచ్ఐవీ కేసులను త్వరగా గుర్తించాలి
నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో పనిచేయాలి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్: E6 న్యూస్: శివ ఠాకూర్ జిల్లాలో ఇంకా గుర్తించాల్సిన హెచ్ఐవీ కేసులను త్వరితగతిన గుర్తించి, బాధితులను చికిత్స పరిధిలోకి తీసుకురావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…
రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం: గణేష్ బిగాల
హైదరాబాద్, జూలై 4 (E6 ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పలు శాఖల్లో మంత్రిగా, పీసీసీ…

