Breaking News

నిజామాబాద్ – బెంగళూరు లహరి బస్సు కు కొత్త బోర్డింగ్ పాయింట్లు

నిజామాబాద్, జూలై 2: E6 న్యూస్ (శివ ఠాకూర్) నిజామాబాద్–హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే టీజీఎస్ఆర్టీసీ లహరి ఏసీ సీటర్ & స్లీపర్ బస్సు సర్వీసుకు ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి తెలిపారు.

ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నగరంలో మెడ్చల్, కొంపల్లి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్ ఎక్స్ రోడ్, శంషాబాద్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు మరింత సౌకర్యవంతంగా లహరి సర్వీసును వినియోగించుకోవచ్చన్నారు.

అలాగే బెంగళూరు నుంచి నిజామాబాద్‌కు వచ్చే డౌన్ సర్వీసుకు పిణ్య, యశ్వంత్‌పూర్, ఆనంద్‌రావు నగర్, ప్యాలెస్ గుట్టహళ్లి, సీబీఐ జంక్షన్, బెంగళూరు విమానాశ్రయం ఎక్స్ రోడ్ ప్రాంతాలను కొత్త బోర్డింగ్ పాయింట్లుగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రయాణికులకు నాణ్యమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన సేవలు అందించడం టీజీఎస్ఆర్టీసీ లక్ష్యమని రీజియన్ మేనేజర్ పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ముందస్తు రిజర్వేషన్ కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *