Breaking News

ప్రత్యేక ఓటర్ సమయ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశం.

  • డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులతో సమావేశం
  • జిల్లా నాయకులకు మండలాల వారీగా ఎస్‌ఐఆర్ బాధ్యతల అప్పగింత
  • ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సర్వేను 100 శాతం పూర్తి చేయాలి’ – నగేష్ రెడ్డి

నిజామాబాద్, జూలై 8: E6 న్యూస్ (శివ ఠాకూర్).

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్)పై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గంలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు వివిధ మండలాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.

సమావేశంలో నగేష్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వేను ప్రతి మండలంలో వంద శాతం సక్రమంగా నిర్వహించే బాధ్యత మండల అధ్యక్షులపై ఉందన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాలు నింపేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి మండలంలో బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు ఫారాలు నింపడంలో సహకరించాలని, అవసరమైన చోట పార్టీ కార్యకర్తలను బీఎల్‌వోలకు సహాయకులుగా నియమించాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా చిత్తశుద్ధితో సర్వే ప్రక్రియలో పాల్గొని, ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు.

గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి గ్రామ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయాలని, సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ మండల కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని నగేష్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రతి ఓటు నమోదయ్యేలా చూడటం మండల అధ్యక్షుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షులు తారాచంద్, రత్నాకర్ గౌడ్, గోపి, రజిత యాదవ్, పాషా, అమృతాపూర్ గంగాధర్, బాలరాజు, చట్ల నరేష్, ముస్కు వెంకటరాం రెడ్డి, మేక వీర్రాజు, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *