కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది: అమరవేణి నర్సాగౌడ్
హుస్నాబాద్ జూలై 11: E6 న్యూస్
గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు.గౌడ కులస్తులకు ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” జాతీయ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించిన గౌడ జన హక్కుల పోరాట సమితి “మోకు దెబ్బ” రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సమయంలో వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,
అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసినట్లుగానే 15 శాతానికే పరిమితం చేసిందని విమర్శించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 900 మంది గీతా కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందినప్పటికీ, ఒక్క కుటుంబానికీ ఆర్థిక సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ పరిధి నుంచి తొలగించాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 50 శాతం తాటి, ఈత చెట్లను నాటి గౌడల సంప్రదాయ వృత్తిని పరిరక్షించాలని కోరారు. అలాగే గీతా కార్మికులకు ఆధునిక భద్రతా పరికరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తే వారి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నాటికి జనగామ జిల్లాను “సర్దార్ సర్వాయి పాపన్న జిల్లా”గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు, గీతా కార్మికులు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.

