భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు.
ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట సతీష్, అంజుమ్ అలీ, సందీప్, ప్రజాప్రతినిధులు జేజే నర్సయ్య, కన్నె సురేందర్, ఆరేపల్లి నాగేంద్ర, బోదిరే నర్సయ్య, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

