దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
జులై 24: E6 tv NEWS ప్రతినిధి.
సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాలు కలగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

