Breaking News

భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన

క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు

సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు

భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో “క్యాచ్ ది రైన్” అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు జీవనాధారమని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని తెలిపారు.అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని నీటి సంరక్షణ, పరిశుభ్రత, ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *