Breaking News

సైబర్ నేరలపై అవగాహన కల్పించిన మాక్లూర్ పోలీసులు.

మాక్లూర్, జూలై 5: E6 న్యూస్ (శివ ఠాకూర్).

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో పలు సూచనలు చేశారు.

పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారి ఆన్‌లైన్ వినియోగాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, కేవైసీ అప్‌డేట్, లాటరీలు, బహుమతులు తదితర పేర్లతో వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. అలాగే ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు వివరాలు, సీవీవీ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను మానవతా దృక్పథంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని, సహాయం చేసిన వారికి ప్రభుత్వం గుడ్ సమారిటన్ విధానంలో తగిన ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు.

సైబర్ నేరాల బారిన పడిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సురక్షిత డిజిటల్ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *