Breaking News

ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు  పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.

ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).

ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అభివృద్ధి పనులను మంజూరు చేసి, నెల రోజుల వ్యవధిలో సంబంధిత ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బోస్లే నారాయణరావు పటేల్ తెలిపారు.

ముధోల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *