Breaking News

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు భారీ వేదిక : ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు

బ్రాహ్మణ సమాజ ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి: ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు
హైదరాబాద్, జూలై 12 (E6TV): హైదరాబాద్‌లోని మల్లాపూర్-VNR గార్డెన్‌లో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్టా కల్యాణ వేదిక, రాజతోత్సవ వేడుకలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్ సలహాదారు శ్రీ హార్కర వేణుగోపాల్ రావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హార్కర వేణుగోపాల్ రావు మాట్లాడుతూ, బ్రాహ్మణ సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాల పరిరక్షణకు, యువతకు వివాహ పరిచయ వేదికలను కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతికి పరస్పర సహకారం, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని ఆయన సూచించారు.
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం నిర్వాహకులు ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవ సంఘ సమాఖ్య రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, వేద పండితులు, పండితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *