Breaking News

హుస్నాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలి.

పెద్ద ఎత్తున మమేకమై, గౌడ సంఘాల ఐక్యతను చాటాలి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపు

నిర్మల్, జూలై 12: E6న్యూస్ తిరుపతి గౌడ్:
హుస్నాబాద్‌లో ఆదివారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి గౌడ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు చేపూరి కనక గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గౌడ సంఘం నాయకులు, ప్రతినిధులు, గౌడ సోదరులు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో గౌడ సమాజ అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక సమస్యలు, ప్రభుత్వ పరంగా సాధించాల్సిన హక్కులు, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.గౌడ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు సమాజ అభ్యున్నతికి అవసరమైన నిర్ణయాలు సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లా పరిధిలోని గౌడ సంఘం నాయకులు, యువత, మహిళలు, గౌడ సోదరులందరూ పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని చేపూరి కనక గౌడ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *