మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపు
గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు.
ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని బీఎంకే బ్యాంకెట్ హాల్‌లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని మోకుదెబ్బ జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. గౌడ జన హక్కులు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని అమరవేణి నర్సాగౌడ్ కోరారు.

