లక్ష్య సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలి
పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ను సందర్శించిన తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్
ముధోల్ జులై 10: E6 న్యూస్ తిరుపతి గౌడ్
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత శైక్షణిక్ సంయోజక్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు సూచించారు.
ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలను శుక్రవారం పర్యటనలో భాగంగా ఆయన సందర్శించారు. తొలుత పాఠశాల ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని పంచ పరివర్తన్ అంశంపై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కృష్ణమాచార్యులు
అనంతరం పాఠశాలలోని వివిధ తరగతులను సందర్శించి ఆచార్యుల బోధనా తీరును పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యా సామర్థ్యాలు, విషయ పరిజ్ఞానం, అభ్యసన తీరును పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఆచార్యులు ప్రోత్సహించాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం
పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణమాచార్యులు వారి భవిష్యత్ లక్ష్యాలు, లక్ష్యాలను చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పాఠశాల ఆచార్యులతో సమావేశమై విద్యాబోధన, విద్యార్థుల సమగ్ర వికాసం తదితర అంశాలపై పలు సలహాలు, సూచనలు అందించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ప్రాంత శైక్షణిక్ సహ సంయోజక్ కడారి కుమార్, విభాగ్ శైక్షణిక్ సంయోజక్ కలిమహంతి వేణుమాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, ప్రధానాచార్యులు సారథి రాజు తదితరులు పాల్గొన్నారు.

