Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ సర్పంచ్ స్వామి

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. 100 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరిక

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.శుక్రవారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం రాంనగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రజాక్ ఖాన్, వార్డు సభ్యులు, సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో పార్టీలో చేరిన సర్పంచ్ స్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను అభినందించారు. రాంనగర్ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జనార్దన్, నాయకుడు మోహన్, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *