Breaking News

నిజామాబాద్ రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

ఇందల్వాయి, జానకంపేట ఆర్‌ఓబీల మంజూరుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు


న్యూఢిల్లీ/నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న, ప్రతిపాదిత రైల్వే అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో సమగ్రంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేసి, ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ కోరారు.

అదేవిధంగా, నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) మంజూరు చేయాలని, డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించబడి ప్రజల ప్రయాణ భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ వివరించారు.

ఎంపీ వినతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఇటీవల ఇందల్వాయి మరియు జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ROBs) మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ అర్వింద్ ధర్మపురి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *