కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్

నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆరోపించారు. విద్యార్థుల న్యాయమైన ఆందోళనలపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ర్యాలీలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ యూత్ నాయకులు, స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా, జకర్ కౌన్సిలర్, ఖిజర్ తదితరులు పాల్గొన్నారు.

