Breaking News

తిర్మాన్‌పల్లి మైనారిటీ కమ్యూనిటీ హాల్‌కు రూ.5 లక్షల నిధులు

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ అందజేత.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి

నిజామాబాద్, జూలై 28: E6 tv NEWS (శివ ఠాకూర్).

అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం తిర్మాన్‌పల్లి గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరు చేయగా, అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను మంగళవారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో గ్రామ ప్రతినిధులకు అందజేశారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనార్దన్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మోహన్ నేతృత్వంలో మైనారిటీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి ప్రొసీడింగ్స్ స్వీకరించారు. నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిర్మాన్‌పల్లి మైనారిటీ కమిటీ అధ్యక్షుడు షేక్ నిజముద్దీన్, మొహమ్మద్ అబ్దుల్, ఇబ్రహీం, తాజుద్దీన్, మక్బూల్, మౌలానా, అఫ్సర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *