Breaking News

ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీలో ప్రజలకు అండగా బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్.

బాసరలో ప్రత్యేక ఫారాల భర్తీ శిబిరం – అర్హులైన ప్రతి ఓటరు దరఖాస్తు సమర్పించాలని పిలుపు

బాసర, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ గల్లీలో గణేష్ మందిరం వద్ద మంగళవారం ప్రత్యేకంగా ఎస్‌ఐఆర్ ఫారాల భర్తీ శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ, ఫారాలను సక్రమంగా నింపించి సంబంధిత బీఎల్‌వోలకు అందజేశారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ బాసర మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఫారాలు నింపడంలో ఎలాంటి సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు.

గడువు ముగిసే వరకు ప్రతిరోజూ ప్రత్యేకంగా ఫారాల భర్తీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ, అర్హులైన ప్రతి ఓటరు దరఖాస్తు సక్రమంగా సమర్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అవసరమైన పత్రాలతో శిబిరానికి వచ్చి ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని కోర్వా శ్యామ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *