గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.
కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతల పాల్గొనడం
జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్)
బాన్సువాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మోరిల్ శ్రీనివాస్ పార్టీలో చేరడాన్ని నాయకులు స్వాగతిస్తూ, ఆయన చేరికతో బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్లో చేరినట్లు మోరిల్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు మోరిల్ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాన్సువాడతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ విస్తరణకు ఈ చేరిక దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.

