ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: తెలంగాణ రక్షణ సేన
E6 న్యూస్: నిజామాబాద్(శివ ఠాకూర్)
ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు.
జూలై 2న హైదరాబాద్ ఉప్పల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూ పోరాట కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి నాయకులు బయలుదేరిన సమయంలో స్థానిక పోలీసు యంత్రాంగం వారిని బైండోవర్ చేసి, పలువురు నాయకులను అదుపులోకి తీసుకుందని ఆరోపించారు. రూరల్ పోలీస్ స్టేషన్, 4 టౌన్, 5 టౌన్, నవీపేట్, ఎడపల్లి, రెంజల్, బోధన్ ప్రాంతాలకు చెందిన నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ.28 వేల పెన్షన్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని ఆరోపించారు. ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ వ్యాప్తంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా కమిటీ సభ్యులు అవంతి, సాయి కిరణ్, శంకర్, శ్రీనివాస్ గౌడ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

