టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్ఓ డా. బి. రాజశ్రీ
టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).
జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ బి. రాజశ్రీ అధికారులను ఆదేశించారు.
టీబీ రోగుల సన్నిహితులకు టీపీటీ అందించాలి
జిల్లా టీబీ సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్లో ఉన్న టీబీ రోగుల సన్నిహితులకు టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ (TPT) అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నివారణ చికిత్స అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి మండలానికి క్లాస్–1 అధికారుల నియామకం
టీబీ నియంత్రణ కార్యక్రమాల పర్యవేక్షణ, సమన్వయం, పురోగతిని మరింత బలోపేతం చేయడానికి జిల్లాలోని ప్రతి మండలానికి ఒక క్లాస్–1 అధికారిని నియమించినట్లు డా. రాజశ్రీ తెలిపారు. ఈ అధికారులు మండల స్థాయిలో టీబీ నిర్మూలన కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు చేపడతారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, ఏవో సుశాంత్ కుమార్, టీబీ కోఆర్డినేటర్లు లక్ష్మణ్, రవి గౌడ్, నరేష్, డీహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, జిల్లా టీబీ నియంత్రణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

