భీంగల్, జూలై 3:E6 న్యూస్ (శివ ఠాకూర్)
నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 85వ శాఖతో పాటు కాప్రి గోల్డ్ లోన్ శాఖను రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభమై నేటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 85 శాఖలతో రూ.4,500 కోట్ల టర్నోవర్ సాధించడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందిస్తూ మరింత ఆర్థిక పరిపుష్టి సాధించి, ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్‌పర్సన్ నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జైజై నరసయ్య, గాయత్రి బ్యాంక్ రీజనల్ హెడ్ అరుణ్‌కుమార్, బ్రాంచ్ హెడ్ జక్క సుమన్, కాప్రి గోల్డ్ లోన్ రీజనల్ మేనేజర్ సురేందర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ నరసయ్య, కౌన్సిలర్లు నాగేంద్ర, సంగ్య నాయక్, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, అనంతరావు, బాబాపూర్ సర్పంచ్ సమీర్, మెండోరా సర్పంచ్ రమేష్, కారేపల్లి సర్పంచ్ మోతీలాల్, గోపాల్, శ్యామ్‌రాజ్, మేకల శ్రీనివాస్, సురేష్, అజయ్, రాజేష్, చిన్నారెడ్డి, నితీష్ తదితరులు పాల్గొన్నారు.

