కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్).
కమ్మర్పల్లి మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి విద్యార్థులకు వివరించారు.
అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం వల్ల వ్యాధులను నివారించవచ్చని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పాఠశాల వంటశాలలో పనిచేసే వంట కార్మికులకు కూడా ఆహార తయారీ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య భద్రతా ప్రమాణాలపై సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కమ్మర్పల్లి వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి, ఆకుల మారుతి, సూపర్వైజర్ శ్రీలేఖ, అనిత, పద్మ, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

