Breaking News

తెలంగాణలో చెదురుమదురు జల్లులు.. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

నిజామాబాద్ జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్

రాష్ట్రంలో గత 24 గంటలుగా పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు విస్తృతంగా కాకుండా పరిమిత ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.

టీజీడీపీఎస్ (TGDPS) వివరాల ప్రకారం అత్యధికంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 17 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కోస్గిలో 15 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాల్లోనూ స్వల్ప జల్లులు కురిశాయి. ఈ వర్షాలు సముద్రంలో నీటి బిందువుల్లా అనిపించినప్పటికీ, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పొడి వాతావరణంలో రైతులకు, ప్రజలకు కొంత ఊరటనిచ్చాయని వాతావరణ పరిశీలకులు పేర్కొంటున్నారు.వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈరోజు కూడా తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తృత వర్షాలు కురిసే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *