Breaking News

#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత


#నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం నిలవదు: కవిత
20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి డిమాండ్**
జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి
* **దిల్‌సుఖ్‌నగర్ నిరుద్యోగుల ధర్నాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక**
దిల్‌సుఖ్‌నగర్, జూన్ 29:**
నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగుల ధర్నాలో ఆమె స్వయంగా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చరిత్రలో నిరుద్యోగుల పొట్టగొట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని హెచ్చరించారు.
### హామీలు ఒకట.. అమలు మరొకటా?
ఎన్నికల ముందు 19 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని ఆశ చూపి, అధికారంలోకి వచ్చాక కేవలం 5 వేల పోస్టులకే పరిమితం చేయడం నిరుద్యోగులను నట్టేట ముంచడమేనని కవిత మండిపడ్డారు. ఇది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమన్నారు.
> “ప్రభుత్వం తక్షణమే స్పందించి 20 వేల కానిస్టేబుల్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే వయోపరిమితిని సడలిస్తూ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, ఎస్సై అభ్యర్థులకు 38 సంవత్సరాల వరకు అవకాశం కల్పించాలి.”
> **– కల్వకుంట్ల కవిత**
>
### జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
ఎన్నికల హామీ ప్రకారం రూ. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం స్పష్టమైన **’జాబ్ క్యాలెండర్’** ప్రకటించి, నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించాలన్నారు.
నిరుద్యోగులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, చివరి శ్వాస వరకు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కవిత హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *