Breaking News

ఫాం పాండ్‌ల నిర్మాణంతో నీటి సంరక్షణకు ప్రాధాన్యం

మద్నూర్‌లో ఐకేపీ సిబ్బందికి సమీక్షా సమావేశం

మద్నూర్, జూలై 28: (E6 tv NEWS ప్రతినిధి).

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఫాం పాండ్‌లు నిర్మించుకోవాలని అధికారులు సూచించారు. మద్నూర్ ఎంపీడీఓ కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద మండలాల ఐకేపీ వీఓఏలు (VOAలు), సీసీలు (CCలు) పాల్గొన్న సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.

ఈ సమావేశానికి అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, సురేష్ హాజరై ఫాం పాండ్‌ల నిర్మాణంపై అవగాహన కల్పించారు. వర్షాభావ పరిస్థితుల్లో నీటి నిల్వలను పెంచేందుకు రైతులు తప్పనిసరిగా ఫాం పాండ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ప్రతి గ్రామ సంఘం నుంచి ఇద్దరు లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వివరాలను ఏపీఓకు అందజేయాలని ఆదేశించారు. అలాగే పాఠశాల విద్యార్థుల యూనిఫాం కుట్టేందుకు టైలర్లను సిద్ధం చేయాలని, మరో రెండు రోజుల్లో వస్త్రం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

మహిళలకు వివిధ జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రెండు మండలాల సీసీలు, వీఓఏలు, ఏపీఎంలు జగదీష్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *