Breaking News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్

రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం

ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్

జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి).

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ రాజీనామా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమానికి చివరికి ప్రతి ప్రభుత్వం తలొగ్గాల్సిందేనని, నియంతృత్వ పోకడలకు స్థానం లేదనే విషయాన్ని ఈ పరిణామం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన నిరంతర పోరాటమే ఈ విజయానికి ప్రధాన కారణమని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను యావత్ ప్రపంచం గమనించిందని పేర్కొన్న ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన, సమగ్ర చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో కోరిన విధంగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించినట్లుగా ఈ అంశంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *