Breaking News

ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.


బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం

నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.
నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో భీంగల్ 100 పడకల ఆసుపత్రి, చేపల మార్కెట్, రహదారులు, మంచిప్ప ప్రాజెక్టు వంటి అనేక అభివృద్ధి పనులను అసంపూర్తిగా వదిలేసి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రైతు సంక్షేమం, మున్సిపల్ అభివృద్ధి పనులు, భీంగల్ పట్టణానికి అదనపు నిధుల కేటాయింపు వంటి హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, కోశాధికారి భక్తవత్సలం, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జావీద్ అక్రం, లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *