Breaking News

వైయస్సార్ 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

భీమ్‌గల్, జూలై 8: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతినిధి-శివ ఠాకూర్).

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు పర్శ అనంత్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆరిగేలా జనార్దన్, కౌన్సిలర్ అంజుమ్, కాంగ్రెస్ నాయకులు రాడే బలరాం, వాక మహేష్, నవీన్, అనిల్, బొర్రన్న తదితరులు పాల్గొని వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *