Breaking News

కోటి దాటిన బాసర అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం

బాసర జూలై 2: E6 న్యూస్.

బాసర, జూలై 2: E6 న్యూస్(తిరుపతి గౌడ్)

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలోని ప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో 49 రోజుల హుండీల లెక్కింపు గురువారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) అంజనీ దేవి హుండీ ఆదాయ వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 49 రోజుల హుండీ ద్వారా రూ.1,06,45,359 నగదు ఆదాయం లభించినట్లు తెలిపారు. అదనంగా 78 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల మిశ్రమ వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లు భక్తులు హుండీలలో సమర్పించినట్లు వివరించారు.

హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ నిర్మల్ జిల్లా పరిశీలకులు ఆర్. రవికిషోర్, ఆలయ ఏఈవో జీ. గంగా శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు శివరాజ్, సంజీవ్ రావు, ఆలయ పరిపాలన, వైదిక సిబ్బంది, తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు, బాసర పోలీసులు, హోమ్ గార్డులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు, అలాగే నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సేవకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *