Breaking News

తాళ్ల రాంపూర్ సర్పంచ్ పావని కుటుంబాన్ని పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి

ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా

పావని మరణం గ్రామానికి తీరని లోటు : మానాల మోహన్ రెడ్డి

ఏర్గట్ల జూలై 11: E6 న్యూస్ తాటికొండ గంగాధర్
బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు బెజ్జారం పావని ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పావని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన మోహన్ రెడ్డి, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. బెజ్జారం పావని గ్రామాభివృద్ధికి కృషి చేసిన ప్రజాప్రతినిధి అని, ఆమె మరణం తాళ్ల రాంపూర్ గ్రామానికి తీరని లోటని అన్నారు. పావని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, వైస్ చైర్మన్ నర్సారెడ్డి, కమ్మర్‌పల్లి మండల అధ్యక్షుడు భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, ఏర్గట్ల మాజీ మండల అధ్యక్షుడు దేవారెడ్డి, గంగ ప్రసాద్, డొంకేశ్వర్ మండల సర్పంచ్‌తో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *