రూ.98.12 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
- నాబార్డ్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభం
- విద్యార్థినులకు యూనిఫామ్‌ల పంపిణీ
- నాణ్యమైన విద్యకు మెరుగైన మౌలిక వసతులే పునాది: ఎమ్మెల్యే
తానూర్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)
తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన అదనపు మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థినులకు అంకితం చేశారు. అనంతరం విద్యార్థినులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థినులు ప్రశాంతమైన, ఆధునిక వాతావరణంలో విద్యను అభ్యసించేందుకు ఈ అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

