400 ఓటరు దరఖాస్తుల పూరణ – శిబిరాన్ని సందర్శించిన తహసీల్దార్, సూపర్‌వైజర్లు.
ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్).
ముధోల్ మండల కేంద్రంలోని జీఎం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం మున్నూరుకాపు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) ప్రక్రియలో భాగంగా ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ ఓటరు దరఖాస్తులను తీసుకువచ్చి బీఎల్‌వోల సమక్షంలో యువ వాలంటీర్ల సహాయంతో సుమారు 400 ఫారాలను పూర్తి చేశారు.
శిబిరాన్ని స్థానిక తహసీల్దార్‌తో పాటు ఎస్‌ఐఆర్ సూపర్‌వైజర్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు పలు సూచనలు, సలహాలు అందించి, ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజలకు సౌలభ్యం కలగడంతో పాటు ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
ముధోల్ పరిధిలోని అర్హులైన ప్రతి ఓటరు తమ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందజేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన యువ వాలంటీర్లను వారు అభినందించారు.

