దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం
దుబాయ్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో చివరి కార్యక్రమంగా గల్ఫ్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరయ్యారు.
యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
“తెలుగు జాతికి తిరుగే లేదు… ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలుస్తుంది” అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించానని అన్నారు.
30 ఏళ్ల క్రితమే ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని, ఈరోజు తెలుగు వారు ప్రపంచ ఐటీ రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.
సత్య నాదెళ్ల వంటి తెలుగు వ్యక్తి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు.
2024 ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించారని అభినందించారు.
గల్ఫ్ దేశాల పురోగతిపై వ్యాఖ్యలు
అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా అడుగులు వేస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగం ఆదాయం పెరుగుతోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దిశ
గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తెచ్చినట్లే, ఇప్పుడు విశాఖకు గూగుల్ వస్తోందని తెలిపారు.
దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు.
ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.
ఐటీ, కమ్యూనికేషన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
వాట్సాప్ ద్వారా 730కు పైగా పౌర సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు.
15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
E6TV వెబ్ డెస్క్ | దుబాయ్ ప్రత్యేక కథనం
దుబాయ్‌లో సీఎం చంద్రబాబు – తెలుగు డయాస్పోరా మహాసభలో ఉత్సాహం..

