You Tube
You Tube Channel
నిక్షయ మిత్రలుగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నమోదు చేపట్టాలి
టీబీ నిర్మూలనకు యువత భాగస్వామ్యం అవసరం: డీఎంహెచ్ఓ డా. బి. రాజశ్రీ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS: శివ ఠాకూర్).జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS) విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి…
అమరులైన విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళి
నీట్ లీకేజీ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి విద్యార్థులపై నమోదైన కేసులు ఉపసంహరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి ముధోల్, జూలై 25: (E6 tv NEWS, తిరుపతి గౌడ్).నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు సంఘీభావంగా ముధోల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి అమరులైన విద్యార్థులకు…
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.7 లక్షల ఎల్ఓసీ అందజేత
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా నిలిచిన ముత్యాల సునీల్ కుమార్ భీంగల్, జూలై 25: (E6 tv NEWS: T,గంగాధర్) భీంగల్ మండల కేంద్రంలోని బోయిగల్లికి చెందిన పల్లేర్ల వైశ్విక్ (తండ్రి: అరుణ్ బాబు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసా ఈ విషయాన్ని తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ…
గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు
డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…
హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్‌లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…
సైబర్ బాధితులకు ఊరట: బాధితుల డబ్బులను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ టాప్!
హైదరాబాద్ : సైబర్ నేరాల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు తిరిగి వారి సొమ్మును రిఫండ్ (Restoration) చేయించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) క్షేత్రస్థాయి పోలీసు విభాగాలతో కలిసి అత్యంత వేగంగా చర్యలు చేపడుతోంది. డిజిపి పర్యవేక్షణ &TGCSB వివరాలు: TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం: ఇ-జీరో ఎఫ్ఐఆర్ (E-Zero FIR) అందుబాటులోకి: సైబర్ మోసాల్లో నిర్ణీత పరిమితికి మించి డబ్బు…
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…
అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం
రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…

