Breaking News

సివిల్స్‌ కొట్టే ఛాన్స్‌.. ఉచిత శిక్షణకు గ్రీన్‌సిగ్నల్‌!

రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ…

Read More

BRS కార్యకర్తపై దాడి.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

పిట్లం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). మండలంలోని చిల్లర్గి గ్రామానికి చెందిన BRS కార్యకర్త శివపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. దాడిలో గాయపడిన శివకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు అభివృద్ధి చేస్తారని…

Read More

అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ మంగళవారం అర్ధరాత్రి చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, రాత్రి వేళల్లో భద్రతా చర్యలను పరిశీలించారు.అనంతరం కంట్రోల్ రూమ్‌లో సీసీ కెమెరాల ద్వారా జరుగుతున్న పర్యవేక్షణను పరిశీలించిన ఎస్పీ.. అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలర్టింగ్,…

Read More

ఘనంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు

25 మంది స్వచ్ఛందగా రక్తదానం నిజామాబాద్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ ఫిజియోథెరపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా నిజామాబాద్ మేయర్  ఉమారాణి, నుడా చైర్మన్  కేశ వేణు, హైకోర్టు అడ్వకేట్ పుల్లెల శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన…

Read More

జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారుల ఎంపిక

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). జిల్లా షూటింగ్ క్రీడకు మరో ఘనత లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన బాలికల విభాగంలో, కొమరోజు శ్రీరామ్ బాలుర విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. కేరళలోని త్రివేండ్రంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు నిర్వహిస్తున్న సౌత్‌జోన్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్-2026 అర్హత పోటీల్లో భావన, శ్రీరామ్…

Read More

భారత్‌లో ఈవీ రికార్డు మోత: ఆగస్టులో 2.98 లక్షల వాహనాలు విక్రయం!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2026 ఆగస్టులో మునుపెన్నడూ లేని విధంగా ఆల్-టైమ్ రికార్డు స్థాయిలో 2,98,448 ఈవీలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా 52.9% వృద్ధి నమోదు కాగా, మొత్తం ఆటోమొబైల్ విక్రయాల్లో ఈవీల వాటా 12.3 శాతానికి చేరింది. విభాగాల వారీగా ఈవీ సేల్స్ వివరాలు: వాహన విభాగం (Vehicle Category) ఆగస్టు…

Read More

చమురు మంటతో నష్టపోయిన మార్కెట్లు…

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 97 డాలర్లకు చేరడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో ప్రధాన సూచీలు జూన్ నాటి కనిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ముఖ్యమైన మార్కెట్ గణాంకాలు: సూచీ / కరెన్సీ ముగింపు స్థాయి మార్పు / నష్టం సెన్సెక్స్ (Sensex) 75,577.58 🔻 555.23 పాయింట్లు (-0.73%)…

Read More

భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేయాలి

మూడు రోజుల్లో సర్వే పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ రైతులు భూ పత్రాలు, హద్దులు చూపించి సహకరించాలి పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). భూముల రీ-సర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నంబర్ 77లో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రోవర్ పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, క్షేత్రస్థాయిలో…

Read More

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.గణేష్ మండపాల నిర్వాహకులు మండపం ఏర్పాటు చేసే ముందు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో…

Read More

భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష

అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ అంకిత్ కొత్తగూడెం, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణి, గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత…

Read More