You Tube
You Tube Channel
గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం..?
చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి…
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు
ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్…
గౌడ, యాదవ కులాలపై వ్యాఖ్యల వివాదం
అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: గౌడ జన హక్కుల పోరాట సమితి నిర్మల్, జూలై 16: E6 న్యూస్ తిరుపతి గౌడ్ గౌడ, యాదవ సమాజాలపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి…
లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్. లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్…
విషమిచ్చి చిరుతపులిని హతమార్చిన ఇద్దరు అరెస్ట్
శరీర భాగాలను విక్రయించి డబ్బు సంపాదించాలన్న యత్నం.. మరో నలుగురు పరారీలో… భీంగల్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీంగల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని విషమిచ్చి హతమార్చిన ఘటనలో ఇద్దరిని అటవీశాఖ అధికారులు గురువారం అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖకు అందిన సమాచారం మేరకు కమ్మర్‌పల్లి రేంజ్ అధికారి కే. అనిత ఆధ్వర్యంలో అధికారులు…
ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్షతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు: డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి.
బీఆర్ఎస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తోంది – ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఐదేళ్లలో నెరవేరుస్తామని స్పష్టం నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్.నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తాహెర్ నగేష్ రెడ్డి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష పేరుతో నాటకాలు…
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు
పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ వచ్చే ఏడాది 2027 సంవత్సరంలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచంపాడు (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పుష్కర…
ఆధునిక నిర్మాణ సాంకేతికతతో నాణ్యమైన భవనాల నిర్మాణం
షేర్ వాల్ టెక్నాలజీతో మోపాల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం పరిశీలించిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలోనూ ఈ సాంకేతికత అమలుకు కృషి చేస్తామని వెల్లడి నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ ఆధునిక నిర్మాణ రంగంలో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో షేర్ వాల్ (Shear Wall) టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి…
కాంగ్రెస్ పార్టీలో చేరిన కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి
నిజామాబాద్, జూలై 16: E6 న్యూస్ శివ ఠాకూర్ మోపాల్ మండలంలోని కులస్పూర్ గ్రామ సర్పంచ్ గుడి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరగా, ఎమ్మెల్యే ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విశ్వసించి పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో…
ప్రశాంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు: ముత్యాల సునీల్ కుమార్
భీంగల్, జూలై 16: E6 న్యూస్ తాటికొండ గంగాధర్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి, ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితమయ్యారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. భీంగల్ మండల కేంద్రంలోని ప్రతిపాదిత 100 పడకల ఆసుపత్రి వద్ద గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 జూన్ 18న రూ.35 కోట్ల అంచనా వ్యయంతో…

