You Tube
You Tube Channel
గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్స
మహిళ కడుపులో 14 సెంటీమీటర్ల రెండు గడ్డల తొలగింపు భీంగల్ శివసాయి ఆస్పత్రి వైద్యుల ఘనత తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం.. ఆస్పత్రి యాజమాన్యానికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు భీంగల్: E6 న్యూస్ హెల్త్: శివ ఠాకూర్ గ్రామీణ ప్రాంతంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి భీంగల్ మండల కేంద్రంలోని శివసాయి ఆస్పత్రి వైద్యులు తమ వైద్య నైపుణ్యాన్ని చాటారు. సిరికొండకు చెందిన 40 ఏళ్ల మహిళ కడుపులో భారీ పరిమాణంలో రెండు గడ్డలను గుర్తించిన వైద్యులు…
మోకుదెబ్బ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి
మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపు గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో నిర్వహించనున్న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని బీఎంకే బ్యాంకెట్ హాల్‌లో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని…
అనధికారికంగా వ్యవహరిస్తున్న పోచంపాడ్ ఎంహెచ్‌ఓ..?
రెండు నెలలుగా విధులకు గైర్హాజరని మెడికల్ ఆఫీసర్ వెల్లడి బుధవారం వచ్చి రిజిస్టర్‌లో సంతకం.. మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఆరోపణ గురువారం మళ్లీ విధులకు డుమ్మా అనుమతులు లేకుండానే విధులకు దూరం: డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడి నిజామాబాద్/పోచంపాడ్, జూలై 09 (E6 న్యూస్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి శివ ఠాకూర్): అంతా తన ఇష్టం.. రావాలనుకుంటే విధులకు వస్తారు.. లేకుంటే రారు..! అధికారుల అనుమతులు లేకుండానే నెలల తరబడి విధులకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు..!…
పెళ్లి చేసుకుంటానని 9 ఏళ్లు నమ్మించి మోసం చేశాడు, సర్పంచ్‌పై యువతి ఆరోపణలు
సహజీవనం, బలవంతపు గర్భస్రావాలు, పెళ్లికి నిరాకరణ అంటూ ఫిర్యాదు – ఆరోపణలను రాజకీయ కుట్రగా కొట్టిపారేసిన సర్పంచ్ దస్తగిరి బోధన్, జూలై 8: E6 న్యూస్, నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామ సర్పంచ్ దస్తగిరిపై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమ పేరుతో తనను నమ్మించి, సర్పంచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి చివరకు మోసం చేశాడని బాధితురాలు సీమ ఆరోపించింది. తనకు న్యాయం…
ఈ నెల 23లోగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలి
S.I.R.లో నమోదు చేయకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలి.. ఒకే చోట కూర్చుని ప్రక్రియ నిర్వహించొద్దు: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, జూలై 8:E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి అర్హ ఓటరు ఈ నెల 23వ తేదీలోగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (S.I.R.) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్…
SIR ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపాలి
ప్రజలకు అవగాహన కల్పించిన బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు విధానంపై వివరాలు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత చేసి గడువులోగా సమర్పించాలని సూచన. బిచ్కుంద, తేదీ జూలై 7: E6 న్యూస్ (ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్). ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి కుటుంబం తప్పనిసరిగా, సక్రమంగా పూర్తి చేయాలని బిచ్కుంద ఎమ్మార్వో బి,వేణుగోపాల్ సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు…
ప్రతి భారతీయుడికి గర్వకారమైన క్షణం.
ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’తో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం. న్యూఢిల్లీ/జకార్తా: E6 న్యూస్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారమైన **’బింటాంగ్ ఆదిపూర్ణ’**ను ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా ప్రదానం చేశారు. భారత్–ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, పరస్పర సహకారం విస్తరణకు చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని…
సైబర్ నేరలపై అవగాహన కల్పించిన మాక్లూర్ పోలీసులు.
మాక్లూర్, జూలై 5: E6 న్యూస్ (శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాక్లూర్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు సైబర్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో పలు సూచనలు చేశారు. పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారి ఆన్‌లైన్ వినియోగాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. బ్యాంకింగ్ సేవలు, కేవైసీ అప్‌డేట్, లాటరీలు, బహుమతులు తదితర పేర్లతో వచ్చే తప్పుడు ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించారు. అలాగే…
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.
కమ్మర్‌పల్లి, తేదీ: 04-07-2026 (E6 న్యూస్ తాటిపల్లి గంగాధర్) కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు భరోసా నిధులు అందుకున్న రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అలాగే బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల…
రోశయ్య గారి సేవలు చిరస్మరణీయం: గణేష్ బిగాల
హైదరాబాద్, జూలై 4 (E6 ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని రోశయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. ప్రజా జీవితంలో నిబద్ధత, నిరాడంబరత, నిజాయితీకి స్వర్గీయ రోశయ్య ఆదర్శప్రాయమైన నాయకుడని కొనియాడారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, పలు శాఖల్లో మంత్రిగా, పీసీసీ…

