ఉప ముఖ్యమంత్రిని కలిసిన మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ – బుద్ధ విహారాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, సెంట్రల్ లైటింగ్‌కు హామీ.
ముధోల్, జూలై 7: E6 న్యూస్ (తిరుపతి గౌడ్). ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గంలో బుద్ధ విహారాల నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటు, పలు దేవాలయాల వద్ద సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ల ఏర్పాటుకు అవసరమైన…

