రూ.16.85 కోట్లకు పైగా సంక్షేమ సహాయం అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం గూపన్పల్లి బైపాస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
మొదట ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన 190 మంది లబ్ధిదారులకు రూ.1,90,22,040 విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇందులో నిజామాబాద్ రూరల్‌కు చెందిన 15 మంది, డిచ్పల్లికి 55 మంది, ఇందల్వాయికి 62 మంది, ధర్పల్లికి 15 మంది, సిరికొండకు చెందిన 43 మంది లబ్ధిదారులు ఉన్నారు.అనంతరం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాలకు చెందిన 299 మంది లబ్ధిదారులకు రూ.14.95 కోట్ల విలువైన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇందులో నిజామాబాద్ రూరల్‌కు 60 మంది, మోపాల్‌కు 3 మంది, డిచ్పల్లికి 45 మంది, ఇందల్వాయికి 58 మంది, జక్రాన్‌పల్లికి 27 మంది, ధర్పల్లికి 7 మంది, సిరికొండకు 99 మంది లబ్ధిదారులు తమ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

