Breaking News

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్

ఏపీ చరిత్రలో సువర్ణ అధ్యాయం 22 నెలల్లోనే అద్భుత ప్రగతి బాబు విజన్‌తో దూసుకుపోతున్నాం మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ పాలనలోనూ మునుపెన్నడూ లేని విధంగా ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును దక్కించుకున్న శుభసందర్భంగా అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయంలో డిన్నర్ విత్ ద రియల్ విన్నర్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ విందులో మంత్రులు ఐఏఎస్ అధికారులు వివిధ శాఖల అధిపతులతో కలిసి లోకేష్ సందడి చేశారు ఈ సందర్భంగా లోకేష్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మనం చిన్నప్పుడు తండ్రి కంటే తల్లితోనే ఎక్కువ సమయం గడుపుతాం తండ్రి ఎప్పుడూ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన ప్రేమను నేరుగా గుర్తించలేకపోవచ్చు కానీ పెరిగి పెద్దయ్యాక ఆ తండ్రి పడ్డ కష్టం చేసిన త్యాగాలే కుటుంబాన్ని నిలబెట్టాయని అర్థమవుతుంది చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్‌కు తండ్రి లాంటి వారు ఆయన గతంలో తీసుకున్న ఐటీ సంస్కరణలు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి నిర్ణయాలు నేడు రాష్ట్ర భవిష్యత్తును మార్చేశాయి అని లోకేష్ భావోద్వేగంగా పేర్కొన్నారు గత 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి ఏ ఇతర రాష్ట్రం సాధించలేదని లోకేష్ స్పష్టం చేశారు భారతదేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఏపీకే రావడం గర్వకారణం గూగుల్ ఇన్ఫోసిస్ టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజాలు ఏపీ వైపు చూస్తున్నాయి కేవలం 30 నిమిషాల్లో లిఫ్ట్ పాలసీకి సీఎం ఆమోదం తెలపడమే దీనికి కారణం మంత్రులు అధికారుల మధ్య ఎక్కడా ఇగో లేదని అంతా ఒక టీమ్‌గా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు చంద్రబాబు గారి దృష్టిలో 1995 99 పాలన అత్యుత్తమమైనది కానీ మా లక్ష్యం ఒక్కటే 2024 29 పాలనే అత్యుత్తమమని స్వయంగా చంద్రబాబు గారే చెప్పేలా పనిచేస్తాం అని లోకేష్ శపథం చేశారు 75 ఏళ్ల వయసులో కూడా సీఎం అంత స్పీడ్‌గా పనిచేస్తుంటే యువ మంత్రులుగా తాము మరింత ఉత్సాహంతో పని చేస్తామని వివరించారు 2024 ఎన్నికల్లో 94 శాతం విజయం సాధించిన టీమ్ ఇది 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు 50 శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలు కావడం విశేషం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 800 ప్రాజెక్టులను ట్రాక్ చేస్తూ గ్రౌండ్ లెవల్‌లో పనులు వేగవంతం చేస్తున్న ఏకైక ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి 4.0 వెర్షన్‌లో భాగస్వాములైనందుకు అదృష్టంగా భావిస్తున్నామని లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు E6TV WEBNEWS మీ వార్తలు మా విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *