*కేక్ కట్ చేసి, కార్మికులకు పండ్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి**
*హాజరైన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు.*
*మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వెల్లడి.**
(ఉమ్మడి జిల్లా ప్రతినిధి: శివ ఠాకూర్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి నేతృత్వంలో మార్కెట్ యార్డులో కార్మిక సంఘాలతో కలిసి ఈ వేడుకలు జరిగావు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, కార్మికుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డులోని హమాలీలు, కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి సభ సాక్షిగా రాహుల్ గాంధీ గారి సమక్షంలో టీపీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన మన నిజామాబాద్ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చురుకైన నాయకత్వంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. జిల్లా అభివృద్ధికి ఆయన అందిస్తున్న సహకారం మరవలేనిదన్నారు.
ఈ వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఐల రాజలింగం, గంగారెడ్డి, మారుతి, మల్లేష్, నరేందర్‌లతో పాటు వివిధ కార్మిక సంఘాల ముఖ్య నాయకులు, మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని సందడి చేశారు.

